ఈ మూవీలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది...ఎస్ ఎస్ రాజమౌళి..!

Pulgam Srinivas
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  దర్శకుడు రాజమౌళి 'బాహుబలి'  సినిమాతో తన క్రేజ్ ను ఇండియా రేంజ్ లో పెంచుకున్నాడు,  అలా బాహుబలి సినిమాతో దర్శకుడిగా ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకు  దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా ఆలియా భట్ ,  ఒలీవియా మోరీస్ హీరోయిన్ లు గా నటించారు,  ఈ సినిమాకు డివివి దానయ్య నిర్మించారు.


  అలాగే ఈ సినిమాలో అజయ్ దేవగన్ , సముద్ర కని ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు,  ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25 వ తేదీన విడుదల చేయబోతున్నారు.  ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం లోని సభ్యులు అనేక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో, ఈవెంట్లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు,  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూ లో రాజమౌళి మాట్లాడుతూ... ఈ మూవీ లో ట్రైన్ బ్లాస్ట్ సీన్ ఉంటుంది , మినియేచర్ సెట్ వేసి .. సీజీ లో కంపార్ట్ మెంట్ ను బ్లాస్ట్ చేయడం జరిగింది అని  రాజమౌళి తెలియజేసాడు. అలాగే ఈ సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చింది, ఇది తెరపై సహజంగా భారీ గా కనిపిస్తోంది. ఈ సన్నివేశం చూస్తే అంతా కూడా విస్మయానికి లోనవుతారు, ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే, దీనిని ఎలా తీశారబ్బా..? అనే ఆలోచన చేస్తూనే ఉంటారు అని  రాజమౌళి తెలియజేశాడు. అంతగా ఈ మూవీ లోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది, అడుగడుగున ఎదురయ్యే అనూహ్యమైన మలుపులు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి అని రాజమౌళి తెలియజేశాడు, ఫీల్ ను పదే పదే పొందడానికి మళ్లీ మళ్లీ థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు" అని తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: