సినిమా విధి వ్రాత పై పూజ హెగ్డే వితండ వాదం !
తాను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను హీరోయిన్ గా పనికిరాను అని కొందరు కామెంట్స్ చేసినప్పుడు తన అదృష్టం అంతేకాబోలు అని సరిపెట్టుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకుంది. అయితే తన ‘విధి’ వ్రాత బాగుండటంతో తాను ఇప్పుడు టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగినప్పటికీ తాను ఇప్పుడు విధిని పూర్తిగా నమ్ముతాను అంటూ కామెంట్స్ చేసింది.
ఏవ్యక్తికి అయినా జీవితంలో ఎదగడానికి కనీసం ఎంతోకొంత లక్ ఉండాలని అలా లక్ లేని వ్యక్తి ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేడు అని తన వ్యక్తిగత అభిప్రాయం అని అంటోంది.
మనిషి జీవితాలను లక్ ప్రభావితం చేసినట్లుగానే నిర్మించిన ప్రతి సినిమాకు ఒక విధి ఉంటుందని విధి సరిగ్గా లేకపోతే ఎంత బాగా తీసినా ఆసినిమా హిట్ అవ్వదు అని తన అభిప్రాయం అంటోంది. ఒక సినిమా కలక్షన్స్ బాగా వచ్చిన సందర్భాలు ఉన్నాయని అదే బాగా కష్టపడి తీసిన సినిమా ఘోరంగా ఫెయిల్ అయిన సందర్భాలు తన కెరియర్ లో ఎన్నో చూసాను అని అంటోంది.
రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి రేపటిని గురించి ఆలోచించి భయపదేకన్నా ఈరోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోమని ఆమె చెపుతోంది. ఇక ప్రభాస్ తో మళ్ళీ తాను ఎప్పుడు నటిస్తానో తనకు తెలియదు అనీ అయితే ప్రభాస్ చాలామంచి వ్యక్తి అని చెపుతూ అలాంటి మంచి వ్యక్తులు ఇండస్ట్రీలో చాల అరుదుగా ఉంటారు అని అంటోంది..