యంగ్ హీరోలకు బ్యాడ్ టైమ్..! గుడ్ టైమ్ ఎప్పుడో..!
విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి'తో వైబ్రెంట్ హిట్ కొట్టాడు. యూత్‌లో సెపరేట్ ఫాలోయింగ్ వచ్చింది. అయితే 'ట్యాక్సీవాలా' తర్వాత విజయ్ మార్కెట్‌లో తేడాలొచ్చాయి. 'డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్' డిజాస్టర్స్‌తో విజయ్ స్పీడ్‌కి బ్రేకులు పడ్డాయి. మరో హిట్ కొట్టి మార్కెట్ నిలబెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో పూరీ జగన్నాథ్‌తో 'లైగర్' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, హిందీ బైలింగ్వల్‌గా రూపొందుతోంది. 2'ఆర్.ఎక్స్.100'తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు కార్తికేయ. అయితే ఈ సినిమా తర్వాత కార్తికేయకి మళ్లీ ఆ రేంజ్‌లో సక్సెస్ రాలేదు. 'హిప్పీ, గుణ 369, 90 ఎమ్.ఎల్., చావుకబురు చల్లగా, రాజా విక్రమార్క' ఇలా వరుస ఫ్లాపులతో కార్తికేయ గ్రాఫ్ పడిపోయింది. ఇక కార్తికేయ విలన్‌గా చేసిన 'గ్యాంగ్ లీడర్, వలీమై' సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. దీంతో ఈ హీరో గ్రాఫ్ మరింత దిగజారింది అంటున్నారు సినీ జనాలు.
విశ్వక్ సేన్ 'ఫలక్‌నుమా దాస్' టైమ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. పబ్లిక్ మీటింగ్స్‌లో బోల్డ్‌గా మాట్లాడి మరో విజయ్ దేవరకొండలా కనిపించాడు. అయితే విశ్వక్ సేన్ స్పీచ్‌లని మ్యాచ్ చేసే హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. 'పాగల్' బాక్సాఫీస్‌ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ హీరో 'అశోకవనంలో అర్జున కళ్యాణం' చేస్తున్నాడు. మంచు బ్రదర్స్ ఇద్దరూ సక్సెస్ కోసం చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు. మనోజ్‌కి ఆరేళ్లుగా సరైన హిట్ లేదు. 'శౌర్య, ఎటాక్, గుంటూరోడు' ఫ్లాపులతో మనోజ్ మార్కెట్ పడిపోయింది. పైగా ఈ హీరో స్పీడ్‌గా సినిమాలు కూడా చెయ్యలేకపోతున్నాడు. మంచు విష్ణు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 'ఈడోరకం ఆడోరకం' తర్వాత విష్ణుకి వరుస ఫ్లాపులొచ్చాయి. ఈ స్లంపు నుంచి బయటపడ్డానికి శ్రీను వైట్ల డైరెక్షన్‌లో 'ఢీ అండ్ ఢీ-డబుల్ డోస్', గాలి నాగేశ్వర్రావు సినిమాలు చేస్తున్నాడు విష్ణు.
మెగా ప్రొడ్యూసర్ వారసుడిగా వచ్చిన అల్లు శిరీష్ జర్నీ కూడా ఫ్లాపులతోనే నడుస్తోంది. 'శ్రీరస్తు శుభమస్తు' తర్వాత శిరీష్‌కి సరైన హిట్ లేదు. 'ఒక్క క్షణం, ఏబిసిడి' లాంటి ఫ్లాపులతో శిరీష్ స్లంపులో పడిపోయాడు. ప్రస్తుతం ఈ హీరో ప్రేమ కాదంట అనే సినిమా చేస్తున్నాడు. సందీప్ కిషన్, రాజ్ తరుణ్ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. బూస్టప్ ఇచ్చే బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు.