"అల్లు అర్జున్ - సంజయ్ లీలా భన్సాలీ" చిత్రంలో మెగా హీరో?

VAMSI
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే. పలు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో బన్నీ కి పాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగి పోయింది. ఇపుడు పుష్ప 2 ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ రీసెంట్ గా బాలీవుడ్ దర్శకుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తో ఓ సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లు సమాచారం అందింది. ఇక అప్పటి నుండి ఈ మూవీకి సంబందించిన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ ని ఒక కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. వరుణ్ తేజ్ కి బాలీవుడ్ లోనూ అభిమానులు  భారీగానే ఉన్నారు, కాబట్టి ఆ స్పెషల్ రోల్ తనతో చేయిస్తే అన్ని విధాలుగా కలిసొస్తుందని అనుకుంటున్నారట. బన్నీ స్పెషల్ గా చెప్పడంతో మెగా ప్రిన్స్ వరుణ్ కూడా సరే అన్నట్లు వినికిడి. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు. కానీ ఈ న్యూస్ విన్న మెగా అభిమానులు మాత్రం ఇది నిజమవ్వాలని ఎంతో ఆశగా కోరుకుంటున్నారు. సంజయ్ లీలా భన్సాలీ  సినిమాల‌లో ప్ర‌ధాన‌ పాత్ర‌ల‌కు, ప్రత్యేక పాత్రలకు గొప్ప క్యారెక్ట‌రైజేష‌న్ ఉంటుంది.

అందుకే అల్లు అర్జున్ మరియు వరుణ్ తేజ్ ఇరువురు కూడా ఈ సినిమాకి ఆలోచించకుండా సరే అన్నట్లు సమాచారం.  ఇక దర్శకుడు భ‌న్సాలీ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ గంగూబాయి క‌ఠియావాడి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళ‌ను రాబట్టడం మాత్రమే కాదు, విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. మరి ఇలాంటి దర్శకుడు బన్నీ లాంటి పవర్ఫుల్ హీరోతో సినిమాని ఇంకే రేంజ్ లో టేకాఫ్ చేస్తారో అన్నది మరింత ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: