ఆర్ఆర్ఆర్ : ఏంటి.. స్టోరీ అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగానా?

frame ఆర్ఆర్ఆర్ : ఏంటి.. స్టోరీ అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగానా?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ఆర్.ఆర్.ఆర్ సినిమా లెన్త్ గురించి నివేదికలు వెలువడ్డాయి. rrr చిత్రానికి హిందీ ఇంకా అలాగే తెలుగు వెర్షన్లకు రన్ టైమ్ వేర్వేరుగా ఉంటుందని సమాచారం తెలుస్తోంది.RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు గత సంవత్సరం డిసెంబర్ నెలలోనే పూర్తయ్యాయి. ఇక దీనికి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్ల నిడివితో 'యూ/ఏ' సర్టిఫికేట్ లభించింది.అయితే ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేశారు.సో ఫైనల్ గా 3 గంటల 2 నిమిషాల నిడివితో రాబోతోందని తెలుస్తోంది. అయితే హిందీ వెర్షన్ మాత్రం 3 గంటల 7 నిమిషాల లోపు రన్ టైంతో ఉందని చిత్ర బృందం వారు అంటున్నారు.ఇక దీనిని బట్టి తెలుగులో కట్ చేసిన సీన్స్ ని హిందీ వెర్షన్ లో మాత్రం అలానే ఉంచారని సమాచారం అనేది తెలుస్తోంది.



కానీ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ మాత్రం rrr హిందీ వెర్షన్ లో 5.01 నిమిషాలు కట్ చేశారని తెలిపారు. ఇప్పుడు 181 నిమిషాల 53 సెకన్లు (3 గంటల 1 నిమిషం 53 సెకన్లు) నిడివితో సినిమా రాబోతోందని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా అల్లూరి సీతారామరాజు ఇంకా కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఇంకా అలాగే హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖని,అలిసన్ డూడీ,రే స్టీవెన్సన్ ఇంకా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియా సరన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.ఇక డైనమిక్ డైరెక్టర్ డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి లెజెండరి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: