మెగాస్టార్ చిరంజీవి కెరియర్ ఎన్నో గొప్ప చిత్రాలు ఉన్నాయి, అలా చిరంజీవి కెరియర్ లో ఉన్న మంచి చిత్రాలలో వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఠాగూర్ సినిమా ఒకటి, ఠాగూర్ సినిమా తమిళ సినిమా రమణ కు రీమేక్ అయినప్పటికీ తెలుగు లో ఠాగూర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక కొత్త రికార్డ్ లను కూడా సృష్టించింది. ఈ సినిమా మెసేజ్ ఓరియంటెడ్ తో కొనసాగుతూనే కమర్షియల్ హంగులు కూడా ఈ సినిమాలో ఉంటాయి, అయితే మెగాస్టార్ చిరంజీవి 'ఠాగూర్' సినిమా తర్వాత స్టాలిన్ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను ట్రై చేసాడు.
కాకపోతే ఠాగూర్ రేంజ్ విజయాన్ని ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి కి తెచ్చి పెట్టలేకపోయింది, ఇది ఇలా ఉంటే మరో సారి ఠాగూర్ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తో దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించనున్నట్లు ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది, అసలు విషయంలోకి వెళితే... మెగాస్టార్ చిరంజీవి, వెంకీ కుడుముల కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన మనందరికీ తెలిసిందే, వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఠాగూర్ లాంటి కథాంశం తో తెరకెక్కే బోతుంది అని తెలుస్తోంది, బలమైన సందేశాన్ని కమర్షియల్ సన్నివేశాలతో చూపించే విధంగా దర్శకుడు వెంకీ కుడుముల స్క్రిప్ట్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది. జూన్ లో ఈ సినిమా లాంచనంగా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది, అలాగే ఈ సినిమా షూటింగ్ జూలై నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా ఏప్రిల్ 29 వ తేదిన విడుదల కాబోతుంది, అలాగే గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడు.