అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా 'మద్రాస్ కేఫ్' సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది, ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగా ఊహలు గుసగుసలాడే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తో మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న రాశి ఖన్నా కు ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో రాశి ఖన్నా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
అలాగే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోయిన్ లలో ఒకరిగా రాశి ఖన్నా కొనసాగుతోంది, రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగు , తమిళ , హిందీ ఇండస్ట్రీ లపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తెలుగులో థాంక్యూ , పక్కా కమర్షియల్ సినిమాలలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది, అలాగే కోలీవుడ్ లో రాశి ఖన్నా 'సర్దార్' లో నటిస్తుంది, అలాగే రాశి ఖన్నా హిందీ లో యోధా , షైతాన్ కా బచ్చా మూవీ లలో నటిస్తుంది. ఇది ఇలా ఉంటే రాశి ఖన్నా ఈ మధ్యనే హిందీ లో రుద్ర అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే, ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లలో పాల్గొన్న రాశి ఖన్నా ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. అందులో భాగంగా రాశి ఖన్నా... మూవీ లలో మూస పద్ధతులను బ్రేక్ చేద్దామని అనుకుంటున్నాను, హీరోయిన్ అంటే రొమాంటిక్ సన్నివేశాల కోసమో, పాటల కోసమో ఉండకూడదు,సి ఇప్పటికే అలాంటి స్క్రిప్ట్ లకు దూరంగా ఉంటున్నాను అని రాశి ఖన్నా తెలియజేసింది.