ఆర్ ఆర్ ఆర్ పారితోషికాల పై వీడని చిక్కుముడి !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ ను ప్రమోట్ చేస్తూ జూనియర్ చరణ్ లు రాజమౌళితో కలిసి దేశంలోని కీలక నగరాలు అన్నీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారికి ఎదురవుతున్న ప్రశ్నలకు చాల తెలివిగా సమాధానాలు ఇచ్చి తమ సమయస్పూర్తి ప్రదర్శిస్తున్నారు. అయితే వీరి ముగ్గురుకి ప్రతిచోట ఎదురవుతున్న ఒక ప్రశ్నకు మటుకు సమాధానాలు చెప్పలేక ఆప్రశ్నను వారు దాటవేసే ప్రయత్నం చేస్తున్నా మీడియా వర్గాలు మాత్రం వారిని వదిలిపెట్టడం లేదు.


ఆప్రశ్న వారి పారితోషికాలకు సంబంధించి ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాత తన సినిమాకు సంబంధించి హీరోలు దర్శకుడు పారితోషికాలను పక్కకుపెట్టి ఆమూవీకి 336 కోట్లు అధికారికంగా తెలియచేసాడు. దీనితో పారితోషికాలు లేకుండానే 300 కోట్లకు పైగా ఖర్చు అయితే హీరోలు దర్శకుడి పారితోషికాన్ని కూడ కలుపుకుంటే ఎంత ఖర్చు అయి ఉంటుంది అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో మాత్రమే కాకుండా మీడియా వర్గాలలో కూడ విపరీతంగా ఉంది.


అందువల్లనే పారితోషికాల ప్రశ్న చరణ్ జూనియర్ లను అదేవిధంగా రాజమౌళిని వదలడం లేదు. పైకి వీరంతా ఈసినిమాకు సంబంధించి పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోలేదు అని చెపుతున్నప్పటికీ రాజమౌళికి 100 కోట్ల పారితోషికం చరణ్ జూనియర్ లకు చెరొక 75  కోట్ల పారితోషికం ముట్టింది అని అంటున్నారు. ఇవన్నీ కలుపుకుంటే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రాజెక్ట్ కాష్ట్ దాదాపు 600 కోట్లకు చేరిపోతుంది.


దీనితో ఈమూవీకి జరిగిన బిజినెస్ 800 కోట్ల పై మాటే అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే ‘ఆర్ ఆర్ ఆర్’’ మూవీకి 100 కోట్లు వచ్చినా లాభాలు రావని కేవలం అసలు మాత్రమే మిగులుతుందని ప్రచారం మొదలైంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ఏచిన్న లోపం కనిపించినా వెంటనే డివైడ్ టాక్ వస్తోంది. ఈ నేపధ్యంలో ఒక చిన్న నెగిటివ్ విషయం కూడ లేకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ అందర్నీ మెప్పించగలదా అన్న సందేహాలు మాత్రం ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

rrr

సంబంధిత వార్తలు: