ఆర్ఆర్ఆర్ ప్రీరిలిజ్ బిజినెస్ 1000 కోట్లు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఈ రేంజ్ లో ప్రమోషన్స్ ను ఆ హీరోలు ఎప్పుడూ చేయలేదు. భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ చేసిన సినిమా అంటే మాటలా.. అంతకు మించి అన్న రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టాలంటే ఈ తిప్పలు పడాలి మరి. ఏదైనా ఊరికే రావు కదా అనే సామెత వినే ఉంటారు. రాజమౌళి, రామ్ చరణ్, రామారావ్. రిలీజ్ డేట్ మార్చ్ 25 వరకు ఆడియెన్స్ సైడ్ ట్రాక్ అవకుండా కావాల్సినంత హైప్ క్రియేట్ చేశారు. మొన్నీమధ్య దుబాయ్ లో ఈవెంట్ ను నిర్వహించి సినిమాను మరింతగా జనాల్లొకి తీసుకెల్లాలని జక్కన్న ప్రయత్నాలు చేశారు.
బెంగళూర్, బరోడా, ఢిల్లీ, అమృత్ సర్, జైపూర్, కోల్ కతా, వారణాసి సిటీస్ లలో కూడా సినిమా ప్రమోషన్స్ ను చేయనున్నారు.ఒక్క ఏపీలోనే 110 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ట్రిపుల్ ఆర్.. పెరిగిన టికెట్ రేట్ ప్రకారం కనీసం 5 రోజులు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డా 100 కోట్లను వసూల్ చెయ్యడం పక్కా,ఇక తెలంగాణ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంతకు మించి జరుగుతుంది. మొత్తానికి మొదటి రోజు 150 కోట్లను రాబట్టడం గ్యారంటీ అని అందరూ అంటారు. మరి సినిమా ఎలా వుంటుందో మరో నాలుగు రోజుల్లో తెలియనుంది.