సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలపై జనాలు ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు, అందులోనూ సినిమా సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలు అంటే జనాలు మరింత ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే సినీ సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు కూడా తొందరగా జనాల్లోకి వెళుతూ ఉంటాయి, అతి తక్కువ కాలంలోనే అనేక వార్తలు బయటకు వస్తూ ఉంటాయి. ఇద్దరు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన హీరో, హీరోయిన్ ప్రేమలో ఉన్నారు అంటే ఆ వార్త మరేంత తొందరగా విస్తరించిందో మన అందరికీ తెలిసింది, అందులో భాగంగా మలయాళ , తమిళ సినిమాల ద్వారా మంచి పాపులారిటీని సంబంధించిన మంజిమా మోహన్ , యంగ్ హీరో గౌతమ్ కార్తీక్ ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇటీవలి కాలంలో వైరల్ అయ్యాయి.
వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది, వీరిద్దరూ కలిసి ఓ తమిళ మూవీ లో నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారం తో వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు అప్పట్లో తెగ హల్ చల్ చేశాయి, ఈ నేపథ్యం లో నటి మంజిమా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామంటూ వస్తున్న వార్తలను విని తాను భయపడ్డానని మంజిమా మోహన్ తెలియజేసింది, ఈ వార్తలకు తన తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారో అనే భయం కలిగిందని , కానీ వారు దేవుడి దయ వల్ల ఈ వార్తలను సీరియస్ గా తీసుకోలేదని మంజిమా మోహన్ తెలిపింది. అలాగే గౌతమ్ ప్రేమను తాను అంగీకరించలేదని చెప్పింది, దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని, తన జీవితం లో ఏదైనా ఉంటే తానే చెపుతానని మంజిమా మోహన్ తెలిపింది. ఇది ఇలా ఉంటే మలయాళం చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించిన మంజిమా మోహన్, ఆ తర్వాత మలయాళ , తమిళ సినిమాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.