మోహన్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రముఖులు..!!

Divya
కలెక్షన్ కింగ్ , డైలాగ్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు గురించి మనం ఏమాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆయన విద్యా నికేతన్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులను ప్రతిభావంతులు గా తీర్చి దిద్ది వారికంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని అందిస్తున్నారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు . భారతదేశ సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు కి నేడు పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సూపర్ హిట్ మ్యాగజైన్ సీఈవో బి.ఏ.రాజు కూడా తన ట్విట్టర్ వేదికగా మోహన్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

బి ఏ రాజు తన ట్విట్టర్ ద్వారా సీనియర్ వర్సటైల్ హీరో.. డైలాగ్ కింగ్,  విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మోహన్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేయడం జరిగింది. మోహన్ బాబు భక్తవత్సలం నాయుడు గా జన్మించి ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు మోహన్ బాబు గా పేరు మార్చడం జరిగింది. ఇక మోహన్ బాబుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన మొదట విలన్ గా ఇండస్ట్రీలో పలు పాత్రల్లో నటించి ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇకపోతే ఆయన వారసులు మంచు విష్ణు ,మంచు మనోజ్,  మంచు లక్ష్మి కూడా సినిమా రంగాలలో పలు సినిమాలలో నటిస్తూ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకోవడంలో ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా మంచు విష్ణు మా అసోసియేషన్ కి అధ్యక్షుడిగా పదవి చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇండస్ట్రీలో గౌరవమైన కుటుంబం గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు కుటుంబం అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా ఈ కుటుంబం గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఏది ఏమైనా ఆయన అభిమానులు,  నెటిజన్లు కూడా మోహన్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: