కాశ్మీర్ ఫైల్స్.. 7 రోజుల్లో చరిత్ర.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?
దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ కు పోటీగా మార్చి 11వ తేదీన ఇక ఈ చిన్న సినిమా విడుదలైంది. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా కేవలం యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పాలి. అయితే అటు భారీ బడ్జెట్ సినిమా రాధేశ్యామ్ యావరేజ్ టాక్ చేసుకుంటే చిన్న సినిమా ది కాశ్మీర్ ఫైల్స్ మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. 1990లలో కాశ్మీర్ పండిట్ల పై జరిగిన మారణహోమం ఘటనలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లుగా చూపించినట్లు తెలుస్తుంది.
ఇక విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు అటు వసూళ్లలో కూడా దూసుకుపోతుంది ఈ సినిమా. పెద్ద సినిమాలకు ఎక్కడ తక్కువ కాదు అనే రేంజ్లో వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. సినిమా థియేటర్ లోకి వచ్చి వారం రోజులు కూడా పూర్తి చేసుకోకుండా ఏకంగా వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఫిలిం అనలిస్టు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో చెప్పిన వివరాల ప్రకారం.. కాశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏడవ రోజు 18.05 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్స్ 97.30 కోట్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఇక 100 కోట్ల వసూళ్లు రావడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి..