స్టార్ హీరోతో పెళ్లికి రెడీ అవుతున్న కోలీవుడ్ భామ?
అక్కకు ఇటీవల పెళ్ళి అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఈమె కూడా పెళ్ళికి రెడీ అయినట్లు తెలుస్తుంది. సౌత్‌లో ని అన్ని భాషల్లో నిక్కీ గల్రానీ సినిమాలు చేసింది. 'యాగవరాయినుం నా కాక్క' అనే తమిళ సినిమా లో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను 'మలుపు' పేరుతో విడుదలైంది. ఈ సినిమా చేస్తున్నప్పుడే నిక్కీకి, ఆది తో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత కొన్నెల్లుగా వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారని తెలుసు.
ఆది పినిశెట్టి ఇంట్లో 2020 జులై లో జరిగిన ఓ ఫంక్షన్‌కు కూడా ఆమె హాజరైంది. ఈ ఫంక్షన్ జరిగిన కొన్ని నెలలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు లో వీరు జంటగా కనిపించడం తో ఆ రుమార్స్ నిజమని అందరు నమ్ముతున్నారు. వీరిద్దరి తో కలిసి వుండే ఓ వ్యక్తి వీరిద్దరు త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారని చెప్పారు. ప్రస్తుతం నిశ్చితార్థానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ ఫంక్షన్ సన్నాహాల ను ఇప్పటికే మొదలుపెట్టారు. త్వరలోనే పెళ్లి జరిగే తేదీని నిర్ణయిస్తారు. కానీ ఈ విషయం పై వీరిద్దరు మాత్రం స్పందించలేదు. పెళ్ళి చెసుకుంటారా లేదా అన్నది తెలియాల్సి వుంది.