మరొక హీరోతో అవకాశం కొట్టేసిన యువ హీరోయిన్ శ్రీలీల..!!

Divya
యువ హీరోయిన్ శ్రిలీల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోషన్ హీరోగా డైరెక్టర్ రాఘవేంద్ర రావు డైరెక్షన్లో వచ్చిన పెళ్లి సందD ఈ చిత్రంతో మొదటిసారిగా తెలుగు లోకి అడుగుపెట్టింది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఈ సినిమా విడుదల కాగా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా కలెక్షన్ల పరంగా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వెలువడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఒక హీరోతో నటించే అవకాశం దక్కించుకుంది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఇక ఈమె నటిస్తున్న రెండవ చిత్రం "ధమాక "ఈ సినిమాను డైరెక్టర్ త్రినాధరావు తెరకెక్కిస్తున్నారు. ఇందులో కథానాయకుడిగా రవితేజ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ స్పెయిన్లో జరుగుతున్న ట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రం తో పాటుగా మెగా  మేనల్లుడు వైష్ణవి తో కూడా మరొక సినిమాలో నటించబోతోంది. ఆ తరువాత నవీన్ పోలిశెట్టి తో కూడా మరొక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇక మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఇప్పుడు మరొక వినిపిస్తున్న వార్త ఏమిటంటే డైరెక్టర్ వక్కంతం వంశీ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయికగా ఎన్నికైనట్లు గా వార్త వినిపిస్తోంది. ఇందులో హీరో నితిన్ హీరోగా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ అయిందని వార్త కూడా తెలుస్తోంది. ఈ చిత్రానికి టైటిల్ "జూనియర్" అని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేయడం కోసం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందులో ఆమెకు ఒక ఒక మంచి పాత్ర దొరకడం తో ఆమె ఒప్పుకున్నట్లు గా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే నితిన్ నటిస్తున్న యాచర్ల నియోజవర్గం సినిమా అయిపోయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: