ఒకప్పుడు సినిమాలు థియేటర్ లలో విడుదల అయిన తర్వాత చాలా కాలానికి 'ఓ టి టి' ల్లోకి వచ్చేవి, కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి, స్టార్ హీరోల సినిమాలు కూడా థియేటర్ లలో విడుదలైన అతి తక్కువ కాలానికే ఏదో ఒక 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి, థియేటర్ లలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలు కూడా అతి తక్కువ రోజుల్లోనే ఏదో ఒక 'ఓ టి టి' లోకి వచ్చేస్తున్నాయి.
అయితే ఇలాగే థియేటర్ లలో విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న భీమ్లా నాయక్ సినిమా కూడా అతి తక్కువ కాలంలోనే 'ఓ టి టి' లోకి రాబోతుంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కి ఎన్నో భారీ అంచనాల నడుమ థియేటర్ లలో ఫిబ్రవరి 25 వ తేదీ న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొని బాక్స్ ఆగిన్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను సాధించిన భీమ్లా నాయక్ సినిమా తెలుగు ప్రముఖ 'ఓ టి టి' ఆహా లో మార్చి 25 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా ఆహా నిర్వహణ బృందం అఫీషియల్ గా ప్రకటించింది, థియేటర్ లలో ప్రేక్షకులను అలరించిన భీమ్లా నాయక్ మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఎ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. భీమ్లా నాయక్ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా, దగ్గుబాటి రానా సరసన సయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది, ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.