ఆ సినిమాలో ప్రభాస్ ఇంటి సెట్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారట..?

Pulgam Srinivas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలలో అంతకుమించిన సినిమాలలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే,  అందులో భాగంగా ప్రభాస్ నటించిన రాదే శ్యామ్  సినిమా భారీ అంచనాల నడుమ మార్చి 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యింది.  ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది,  ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయినప్పటికీ రాదే శ్యామ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్ లను బాగానే రాబడుతోంది.   ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం సలార్ , ఆది పురుష్,  ప్రాజెక్ట్ కే మూవీ లలో నటిస్తున్నాడు,  ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో స్పిరిట్ మూవీ లో కూడా ప్రభాస్ ఒక  నటించబోతున్నాడు,  ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కబోయే స్పిరిట్ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇప్పటికే జరిగిపోయింది.


  ఇది ఇలా ఉంటే ప్రభాస్,  మారుతీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే,  అయితే మారుతి , ప్రభాస్ కు ఒక కథ వినిపించినట్టు,  ఆ కథ నచ్చిన ప్రభాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు నటించబోతున్నట్లు తెలుస్తోంది,  అందులో భాగంగా ఒక హీరోయిన్ గా మాళవిక మోహన్ ను ఓకే చేయగా,  రెండవ హీరోయిన్ గా కృతి శెట్టి ను చిత్ర బృందం ఓకే చేసినట్లు తెలుస్తోంది,  మూడవ హీరోయిన్ కోసం చిత్ర బృందం వెతుకులాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ ఇంటి సెట్ కోసం ఏకంగా 5 కోట్ల తో ఒక భారీ సెట్ ను హైదరాబాద్ లో నిర్మిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి, ఈ సెట్ లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: