ఇక ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయులు అందరూ కూడా ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్న
సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ నెల 25 వ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
కేరళ రాష్ట్రంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకు మరో కొత్త తలనొప్పి అనేది మొదలైంది. తాజా వార్తల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే మొదటి వారం షేర్ 55% ఉంటేనే సినిమాను ప్రదర్శిస్తామని FEUOK (ది ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ) డిస్ట్రిబ్యూటర్లను హెచ్చరించిందని సమాచారం తెలుస్తోంది.లాభాల మార్జిన్లు లిమిట్ కావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు ఇది చాలా కష్టమైన పని.
కేరళ రాష్ట్రంలో చాలా మంది చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు
సినిమా హక్కులను పొందేందుకు ఎంతో భారీ ఖర్చు పెట్టారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లు సహకరించడం లేదన్న ఈ కొత్త తలనొప్పి ఉద్రిక్త పరిస్థితిని క్రియేట్ చేసింది.మరి ఈ పరిస్థితిని తగ్గించేందుకు
rrr సినిమా నిర్మాత ఇక ఏం చేస్తారో చూడాలి.
మార్చి 25 వ తేదీన మలయాళంలో
rrr సినిమా రికార్డు స్థాయిలో స్క్రీన్ లలో రిలీజ్ అవుతుంది.
ఇక మన హీరోలకున్న
మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందం అక్కడ కూడా ప్రమోషనల్
ఈవెంట్స్ భారీగా నిర్వహించారు.దర్శకధీరుడు
జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్'
సినిమా కోసం యావత్ సినీ అభిమానులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో
ఎన్టీఆర్ -
రామ్ చరణ్ హీరోలుగా నటించగా..
అజయ్ దేవగన్ -
అలియా భట్ - ఒలివియా మోరిస్ -
సముద్రఖని వంటి నటి నటులు కీలక పాత్రలు పోషించారు.అల్లూరి సీతారామరాజు ఇంకా కొమురం
భీమ్ నిజ
జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథాంశంతో
rrr సినిమా రూపొందిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామరాజుగా చరణ్.. ఇంకా
కొమరం భీమ్ గా
తారక్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను భారీగా రెట్టింపు చేసింది.