మెగా మేనల్లుడు ఎన్నడూ లేనివిధంగా డిఫరెంట్ లుక్ లో మెస్మరైజింగ్ చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో బైక్ యాక్సిడెంట్ కి గురయ్యాడు హీరో సాయి ధరమ్ తేజ్. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి పోవడం జరిగింది. మెగా అభిమానులు సైతం ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత ఆపరేషన్ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దాదాపుగా ఎన్నో నెలల తర్వాత హాస్పిటల్ నుంచి క్షేమంగా బయటికి విడుదలయ్యారు. అప్పట్నుంచి అస్సలు కనిపించలేదు ఈ హీరో.
ఇటీవలే కనక దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన సాయి ధరమ్ మీడియా తో ముచ్చటించడం జరిగింది. రిపబ్లిక్ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ ఏ సినిమాని ఒప్పుకోలేదు.. దీంతో తన తదుపరి చిత్రం కోసం ఈ హీరో అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సరికొత్త మేక్ఓవర్ లుక్ ని విడుదల చేసి సర్ప్రైజ్ చేశాడు సాయి ధరమ్ తేజ్. గాడ్స్ టైమింగ్ ఈస్ ఫర్ఫెక్ట్ అంటూ ఇటీవల పోస్ట్ చేసిన ఈ పోస్ట్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. దీంతో సాయి ధరంతేజ్ త్వరలోనే తన తదుపరి చిత్రానికి సిద్దమవుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తిగా తన గెటప్ ను మార్చి సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్.
తాజాగా ఖాకి కలర్ బ్లేజర్ షర్ట్ ను వేసుకొని.. బ్లూ కలర్ జీన్స్ ధరించి స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ ఫోటోను తన అభిమానులతో పంచుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇదిలా ఉండగా సాయిధరమ్ తేజ్.. వినోదయ సీతం అనే రీమేక్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సముద్రఖని ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక అంతే కాకుండా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోయే ఇది కూడా సముద్రకని.