శ్రీవల్లి పాటకు ముంబై పోలీసుల బ్యాండ్ వైరల్..!!

Purushottham Vinay
ఇక గత ఏడాది చివర్లో వచ్చిన అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా దేశ వ్యాప్తంగా కూడా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా భారీ విజయం సాధించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లని కూడా రాబట్టింది.ఇక హిందీలో అయితే 'పుష్ప' సినిమా అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ విజయం సాధించింది. నార్త్ ఇండియాలో 'పుష్ప' ఫీవర్ తో జనాలు ఊగిపోయారు. ఇక సినిమాలోని సాంగ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'పుష్ప' సినిమాలోని ప్రతి పాట కూడా దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగా పాపులర్ అయ్యాయి.ముఖ్యంగా శ్రీవల్లి సాంగ్ అయితే చాలా బాగా వైరల్ అయింది. ఈ సాంగ్ ఇంకా ఇందులోని స్టెప్స్ సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో బాగా చక్కర్లు కొట్టి వైరల్ అయ్యాయి. నార్త్ ఇండియాలో ఈ పాట బాగా హిట్ అయింది. యూట్యూబ్ లో కూడా శ్రీవల్లి పాట రికార్డ్స్ క్రియేట్ చేసింది. చాలా మంది కూడా ఇక ఈ పాటకి కవర్స్ సాంగ్స్ కూడా చేశారు. సెలబ్రిటీలు కూడా ఈ పాటకి రీల్స్ చేశారు. 



తాజాగా ముంబై పోలీసులు కూడా 'పుష్ప' సినిమాలోని ఈ శ్రీవల్లి సాంగ్ ని రీక్రియేషన్ చేశారు.ఇక ముంబై పోలీసుల్లో స్పెషల్ ట్యాలెంట్ ఉన్న కొంతమందితో 'ఖాకీ స్టూడియో' అనే మ్యూజిక్ బ్యాండ్ ని రెడీ చేశారు.వీరు స్పెషల్ డేస్ లో, లేదా ఎప్పుడైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ లో వీరంతా కూడా కలిసి పాటలు పాడటం, మ్యూజిక్ వినిపించడం చేస్తూ ఉంటారు. తాజాగా ఈ ఖాకి స్టూడియోలో ఉన్న పోలీసులు 'పుష్ప' సినిమాలోని శ్రీవల్లి సాంగ్ ని తమ వాయిద్య పరికరాలతో బ్యాండ్ మోగించి వినిపించారు.అలాగే ఈ మ్యూజిక్ బ్యాండ్ వాయించిన శ్రీవల్లి సాంగ్ ని తమ అధికారిక ముంబై పోలీసుల యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. ఇక అది ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.ఇక ముంబై పోలీసులు ఎంతో అద్భుతంగా శ్రీవల్లి పాటని వాయించి వినిపించారు. ఇది చూసిన వారంతా కూడా పోలీసులని బాగా అభినందిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ అభిమానులు అయితే ఈ వీడియోని తెగ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: