ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న క్రేజీ సినిమాలు ఇవే..
పునీత్ లాస్ట్ సినిమా జేమ్స్, రాజ్ తరుణ్ స్టాండప్ రాహుల్ మాత్రమే థియేటర్లలోకి వస్తుంటే ఓటీటీలో మాత్రం చాలా సినిమాలు రానున్నాయని తెలుస్తుంది. ఆ సినిమాలు ఓటిటిలో విడుదలకు రెడీగా ఉన్నాయి.బ్లడీ బ్రదర్స్ సిరీస్ 18 మార్చి జీ 5లో రిలీజ్ కాబోతోంది. ఇక ధ్రిల్లర్ డ్రామాగా ఫస్ట్ సీజన్ తోనే ఆడియన్స్ ని క్రేజీగా ఆకట్టుకున్న అపహరణ్ సిరీస్ సెకండ్ సీజన్ తో ఈ శుక్రవారం వూట్, బాలాజీ ఓటీటీ యాప్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రతి వారం ఆహాలో ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు అందిస్తుంది.
కిరణ్ అబ్బవరం కామెడీ థ్రిల్లర్ సెబాస్టియన్ పిసి 524, మార్చి 18నే స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. కామెడీ, ఫ్యామిలీ డ్రామాని ఇష్టపడే ఆడియన్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లలితా సుందరం సినిమాని కూడా అందిస్తుంది. ఇకపోతే రొమాన్స్ థ్రిల్లర్ డ్రామాగా 18 మార్చి నుంచి డీప్ వాటర్ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ మద్య ఓటీటీల్లో హల్ చల్ చేస్తున్న బాలీవుడ్ స్టార్స్ కూడా వరుస సినిమాలు విడుదలకు సిద్దం కానున్నాయి.. మొత్తానికి ఈ వారం ఓటిటిలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. సినిమాలు అన్నీ కూడా ప్రెక్షకులను విపరీతంగా ఆకట్టుకొనున్నాయి. ఇది ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న క్రేజీ సినిమాలు.. ఎ సినిమా ఎలా ఆకట్టుకుంటోంది అనేది తెలియాల్సి ఉంది.