రామ్ చరణ్ హీరోగా, తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం RC-15. ఈ చిత్రం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక ఇందులో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు అని వార్తలు ఇండస్ట్రీలో టాక్ గా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం మాత్రం యూనిట్ సభ్యుల ద్వారా లీక్ అయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని వీడియోలు, ఫోటోలు లీక్ అవ్వడం కూడా జరిగింది. దీంతో దిల్ రాజు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటివి లిక్ కాకూడదంటు విజ్ఞప్తి చేశారు.
మరొకసారి ఏదైనా ఈ సినిమాకు సంబంధించి లీక్ అయినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే అప్పటి వరకు లీకైన ఫోటోలు వీడియోలు ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులు గా నటించబోతున్నారు. ఇక ఈ చిత్రం లోని తండ్రి స్నేహితుడు పాత్రలో హీరో శ్రీకాంత్ నటించబోతున్నట్లు గా తెలుస్తోంది. ఇక ఫ్లాష్బ్యాక్లో ఇద్దరు స్నేహితులు కలిసి ఒక రాజకీయా పార్టీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక అలాంటి సమయంలోనే రామ్ చరణ్ ను వెన్నుపోటు పొడిచే పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడు.
ఇక రామ్ చరణ్ నటిస్తున్న తండ్రి పాత్రలో ఉన్న రామ్ చరణ్ ని హత్య చేస్తాడని ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతోంది.. అలా రామ్ చరణ్ తన తండ్రి చావుకి కారణమైన శ్రీకాంత్ పై కోపంతో రగిలి పోతూ ఉంటారు అన్నట్లుగా కథ ఉండబోతోంది అన్నట్లుగా సమాచారం. ఈ సినిమా స్టొరీ పాతదే అయినప్పటికీ పూర్తిగా డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని చూపించడంలో తనదైన శైలిలో చూపిస్తున్నదనే వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం రాజకీయాలలో ఉన్న పరిస్థితులను బట్టి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు గా సమాచారం. ఇక ఈ చిత్రానికి అత్యధిక టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిస్తున్నట్లు గా తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి కీలక ప్రకటనలు త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయట.