పుష్ప పై కోపాన్ని రాధే శ్యామ్ పై చూపిస్తున్న బాలీవుడ్ క్రిటిక్స్..!!

murali krishna
ప్రభాస్ మరియు పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ ఫస్ట్ వీకెండ్ వరకు భారీస్థాయిలో కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయట.

అయితే సోమవారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు ఊహించని స్థాయిలో డ్రాప్ అయ్యాయని ప్రచారం అయితే జరుగుతోంది. బాహుబలి సిరీస్, సాహో సినిమాలను ఆదరించిన బాలీవుడ్ ప్రేక్షకులు సైతం రాధేశ్యామ్ ను అస్సలు పట్టించుకోవడం లేదు. రాధేశ్యామ్ మూవీకి హిందీలో నెగిటివ్ టాక్ రావడంతో పాటు బాలీవుడ్ క్రిటిక్స్ ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు కూడా ఇవ్వడంతో కలెక్షన్లపై ఊహించని స్థాయిలో ప్రభావం పడుతోంది

అయితే టాలీవుడ్ సినిమా అయిన రాధేశ్యామ్ పై బాలీవుడ్ క్రిటిక్స్ ప్రతీకారం తీర్చుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని అర్ధమవుతుంది.. గతేడాది బాలీవుడ్ లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప బాలీవుడ్ లో కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కగా తగ్గేదేలే అనే డైలాగ్ తో బన్నీ ఎంతో అకట్టుకున్నారు. ఈ సినిమా విడుదలైన సమయంలోనే విడుదలైన 83 మూవీ అంత భారీస్థాయిలో కలెక్షన్లను సాధించలేదు.

 

అయితే ప్రస్తుతం రాధేశ్యామ్ హిందీలో నెగిటివ్ టాక్ తో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతోందని తెలుస్తుంది.. అయితే హిందీ మూవీ ది కశ్మీర్ ఫైల్స్ ప్రభావం రాధేశ్యామ్ పై గట్టిగా పడుతోందట.వీకెండ్ తర్వాత రాధేశ్యామ్ సినిమా కోసం కేటాయించిన స్క్రీన్లు ది కశ్మీర్ ఫైల్స్ కు ఇచ్చేస్తున్నారని సమాచారం.ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు కలెక్షన్లు సైతం అంచనాలను మించి వస్తున్నాయని తెలుస్తుంది.

 

రాధేశ్యామ్ హిందీ ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నా కానీ బాలీవుడ్ క్రిటిక్స్ రాధేశ్యామ్ కు మరీ ఘోరంగా రివ్యూలు ఇవ్వడంతో సినిమా కలెక్షన్లపై బాగా ప్రభావం పడింది. బాలీవుడ్ క్రిటిక్స్ పుష్ప దెబ్బకు రాధేశ్యామ్ సినిమాపై పగ తీర్చుకోవడంగా కనిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: