ఆ సినిమా చూసి నేను నా భర్త ఏడ్చేసాం : ప్రణిత

praveen
ఇటీవలికాలంలో భారీ బడ్జెట్ తో ఊహించని రేంజిలో కమర్షియల్ హంగులతో సినిమాలు తీయడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అంతే కాదు వందల కోట్ల బడ్జెట్ తో తీస్తే లాభాలు వస్తాయని ఎంతో మంది నిర్మాతలు కూడా నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో కూడా ఇంకా ఎంతోమంది నిజ జీవిత సంఘటనలను ఆధారంగా దగ్గరగా ఉండే సినిమాలు తీసి ప్రేక్షకులను అలరిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా నిజ జీవిత సంఘటనల ఆధారంగా వచ్చిన ఎన్నో సినిమాలు ప్రస్తుతం ఊహించని రేంజ్ లో క్రేజ్ సంపాదించాయ్ అని చెప్పాలి.

 అంతేకాదు కమర్షియల్ హిట్ కాకపోయినప్పటికీ మంచి మెసేజ్ ఇచ్చిన సినిమాగా.. తెలియని విషయాలు తెలియజేసిన సినిమాగా ప్రేక్షకుల మన్ననలు పొందాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల ఇలాంటి యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్. 1990 లో జమ్మూ కాశ్మీర్ లో చోటుచేసుకున్న తిరుగుబాటు సమయంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దారుణ ఘటన నేపథ్యంలో ఎన్నో హిందూ కుటుంబాలు వలస.. హృదయవిదారక ఘటనలు అన్నింటినీ కూడా ఎలాంటి కమర్షియల్ హంగులు అద్దకుండా కళ్లకు కట్టినట్లుగా తెరకెక్కించిన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్.



 ఇక ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడి మనసుని కదిలిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలి హీరోయిన్ ప్రణిత ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.  ఈ సినిమాని ప్రతి ఒకరు చూడాలి అంటూ కోరింది. నేను నా భర్తతో కలిసి ది కాశ్మీర్ ఫైల్స్  సినిమా వీక్షించాను. ఈ సినిమా పూర్తయ్యే సరికి నేను నా భర్త ఏడ్చేసాం. సుమారు 30 సంవత్సరాల క్రితం కాశ్మీరి పండిట్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు అంటూ ప్రణీత ఈ సినిమా చూసిన తరువాత తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: