'జిల్' ఫేమ్
రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో పాన్
ఇండియా సూపర్ స్టార్
ప్రభాస్ - బుట్ట బొమ్మ
పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడికల్
లవ్ డ్రామా ''రాధే శ్యామ్''.ఈమధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ
సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. విజువల్ గ్రాండియర్ వున్నా కాని ఈ
సినిమా సినిమా మెజారిటీ ప్రేక్షకులను మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.'రాధేశ్యామ్' సినిమాకి ఫస్ట్ డే డివైడ్ టాక్ రావడంతో పాటుగా రివ్యూలు కూడా అంత ఆశాజనకంగా రాలేదు.
సినిమా చూసిన
ఆడియన్స్ నుంచి వస్తున్న ప్రతికూల స్పందనలపై దర్శకుడు
రాధాకృష్ణ కుమార్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. మొదటి నుంచీ కూడా ఇదో ప్రేమకథ అని చెప్తున్నా కూడా దాన్నుంచి యాక్షన్ ఆశించినందుకు విమర్శకులను తప్పుపడుతున్నారు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ కుర్ర దర్శకుడు మాట్లాడుతూ.. " ఇక మీరు
చికెన్ బిరియాని కోసం వెజిటేరియన్ హోటల్ కి వెళతారా? మేము ఎప్పటి నుంచో కూడా ఇది
లవ్ స్టోరీ అని చెప్తూ వస్తున్నాం. కానీ ఈ సినిమాలో యాక్షన్ లేదని విమర్శకులు అంటున్నారు. ఇందులో అసలు ఏమైనా అర్ధం ఉందా?" అని అన్నారు. దీనిని బట్టి 'రాధే శ్యామ్'
సినిమా పై నెగెటివ్ కామెంట్స్ పై
రాధాకృష్ణ ఫుల్ గా అప్సెట్ అయినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.కాగా ప్రేమకు విధికి మధ్య యుద్ధంగా మేకర్స్ ''రాధేశ్యామ్'' సినిమాని అభివర్ణించారు. ఈ సినిమాలో
హస్త సాముద్రికా నిపుణుడు విక్రమాదిత్యగా యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్.. అలాగే ప్రేరణగా
పూజా హెగ్డే నటించారు.
రెబల్ స్టార్ ప్రభాస్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్, జయరామ్, ప్రియదర్శి, సత్యరాజ్, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్ టెల్ శాషా ఛత్రి,
రిద్ది కుమార్ ఇంకా అలాగే
సత్యన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.