షాక్: రూమర్స్ కు చెక్ పెట్టిన మెగా డాటర్..!!

Divya
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఆధునిక ప్రపంచంలో రూమర్ ఏదైనా సరే క్షణాలలో వైరల్ గా మారుతూ ఉంది.. ఇక సెలబ్రిటీల విషయాలు అయితే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వారి గురించి ఉన్నవి లేనివి ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ రూమర్స్ కారణంగా ఎంతో మంది సెలబ్రిటీలు హర్ట్ అయిన విషయం కూడా చాలామందికి తెలిసిందే.. కానీ ఈ రూమర్స్ క్రియేట్ చేసే వారు మాత్రం .. ఏ మాత్రం వారి ఎమోషనల్ పట్టించుకోకుండా తమకు ఇష్టం వచ్చినట్టుగా నోటి కి వచ్చింది రాసుకుంటూ పోతుంటారు. ఇక ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక అలాగే ఆమె భర్త చైతన్య మధ్య పుట్టిన కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీంతో ఆ వార్తలకు చెక్ పెట్టడానికి ఏకంగా నిహారిక రంగంలోకి దిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలా ఉండగా నిహారిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను తాత్కాలికంగా డిలీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇందుకు కారణం తన వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటోంది అనే వార్త వైరల్ గా మారుతుంది. అయితే ఇది నిజమా అబద్దమా అన్న దానిపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. వాస్తవం అనేది ఎవరికీ తెలియదు కానీ.. నిహారిక తనకు సంబంధించిన వ్యక్తిగత పోస్టులు అలాగే తన భర్త జే వి చైతన్య గురించి ఏమైనా పోస్టులుంటే చాలు ప్రతి సాధారణమైన విషయమే అయినప్పటికీ పుకార్లు సృష్టించి వైరల్ చేస్తూనే ఉన్నారు.

అయితే ఈ రూమర్స్  చెక్ పెట్టడానికి నిహారిక తన భర్త జే వి చైతన్యతో కలిసి ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేయడం జరిగింది. అంతే కాదు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టినట్లే అని తెలుస్తోంది. నిహారిక పెళ్లి తర్వాత నటిస్తుందనే వార్తలు వచ్చినా ఆమె మాత్రం విరామం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈమె దీనిపై వస్తున్న  వార్తలకి కూడా చెక్ పెట్టి వివరణ ఇస్తుందేమో చూడాలి మరి. ఇకపోతే యాంకర్ గా,  నటిగా,  నిర్మాతగా తనలో ఉన్న నైపుణ్యాన్ని ఇలా ఒక్కసారిగా మూసివేయడం అభిమానులకు నచ్చడం లేదు అందుకే ఆమె  కచ్చితంగా వివరణ ఇవ్వాలి అని అభిమానులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: