రాధేశ్యామ్ కు మిక్స్ డ్ టాక్.. అభిమాని ఆత్మహత్య?
ఇక ఇలా మొదటి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఇక ఆ తర్వాత మాత్రం ఈ పిరియాడికల్ లవ్ స్టోరీ కి భిన్నమైన టాక్ వస్తూ ఉండడం గమనార్హం. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కి మిక్స్ డ్ టాక్ వస్తుందని కొంతమంది అభిమానులు మాత్రం నిరాశలో మునిగిపోతున్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక అభిమాని మాత్రం షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రభాస్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది అని మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కర్నూలు జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కర్నూలు తిలక్ నగర్లో నివాసం ఉండే రవితేజ అనే 24 ఏళ్ల యువకుడు రాధేశ్యామ్ సినిమా బాగాలేదు అని టాక్ వస్తున్న నేపథ్యంలో మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే కఠిన నిర్ణయం తీసుకొని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్య చేసుకునే ముందు తాను చనిపోవడానికి గల కారణం కూడా తల్లితో చెప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పలు ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా విడుదలవడం లేదని గతంలోనూ కొంతమంది ప్రభాస్ అభిమానులు సూసైడ్ నోట్ రాసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.