సాహో నుండి పాఠాలు నేర్చుకోలేకపోయిన రాథే శ్యామ్ !

frame సాహో నుండి పాఠాలు నేర్చుకోలేకపోయిన రాథే శ్యామ్ !

Seetha Sailaja
‘రాథే శ్యామ్’ మూవీకి పెట్టిన ఖర్చులో చాలమటుకు అనవసరపు వృధా అయింది అంటూ ఇండస్ట్రీ వేర్గాలలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈమూవీని నిర్మించిన యూవీ క్రియేషన్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ మాత్రమే కాకుండా ప్రభాస్ కు ఈ సంస్థలో కీలకమైన పెట్టుబడులు కూడ ఉన్నాయి అన్న ప్రచారం కూడ ఉంది.


ఈ సంస్థ నిర్మాణంలో ‘మిర్చి’ ‘సాహో’ లాంటి భారీ సినిమాలు మాత్రమే కాకుండా అనుష్క తో ‘భాగమతి’ మూవీతో పాటు మరికొన్ని సినిమాలు కూడ తీసారు. అయితే ఈ నిర్మాణ సంస్థకు ‘మిర్చి’ లో మినహా మరే ప్రాజెక్ట్ లోను సరైన లాభాలు రాలేదు అన్న ప్రచారం కూడ జరుగుతోంది. ‘సాహో’ ను అత్యంత భారీ బడ్జెట్ తో తీసి పరాజయాన్ని మూట కట్టుకున్నారు.


అయితే ఈ ఘోర పరాజయం తరువాత యూవీ సంస్థ తన పరాజయాల నుండి పాఠాలు నేర్చుకోలేకపోయిందా అన్న సందేహాలు కల్గుతున్నాయి. ‘రాథే శ్యామ్’ నిర్మాణంలో కోట్లాది రూపాయలు వృధాగా ఖర్చు అయిపోయాయ అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. ‘రాధే శ్యామ్’ లాంటి భారీ ప్రేమ కథా చిత్రం తీయాలి అనుకున్నపుడు హీరో హీరోయిన్ల ఎంపికతో పాటు మంచి సంగీత దర్శకుడిని కూడ పెట్టుకోవాలి. అది ఈమూవీ విషయంలో జరగలేదు.


సరైన పాటలు ఉండి ఉంటే ఈమూవీకి ఇలాంటి టాక్ వచ్చి ఉండేది కాదు అని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తీయాలి అన్న ఆలోచన మంచిదే అయినప్పటికీ దాదాపు ఈసినిమాకు 40 వరకు సెట్లు వేసి ఒక్క ఆర్ట్ డిపార్ట్ మెంట్ కే 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు అన్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ప్రభాస్ కు తన కృష్ణంరాజు పై ఉన్న ప్రేమ అందరికీ తెలిసినదే అయినప్పటికీ ఈమూవీలో పరమ హంస పాత్రలో నటించిన కృష్ణంరాజు కళ్ళల్లో మెరుపు తగ్గిపోయింది అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఏది ఏమైనా భారీ అంచనాలతో విడుదలైన ‘రాథే శ్యామ్’ బయ్యర్లకు తీవ్ర నష్టాలు తప్పవు అన్న ప్రచారం అప్పుడే మొదలైపోయింది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: