డాన్స్ కి ఫిదా అయిన జానీ మాస్టర్.. ఆ కంటెస్టెంట్ కి స్పెషల్ గిఫ్ట్?
ఇలా జానీ మాస్టర్ పట్టిందల్లా బంగారం అయినట్లు డాన్స్ కంపోజ్ చేసిన ప్రతిపాదన కూడా సూపర్హిట్ అవుతూ ఉండడం గమనార్హం. అయితే ఒక వైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ జానీ మాస్టర్ అటు కొన్ని బుల్లితెర కార్యక్రమాల్లో కూడా అల్లరిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈటీవీ లో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ ఢీ షోలో గత కొంత కాలం నుంచి జడ్జిగా వస్తున్నారు జానీ మాస్టర్. అయితే సాధారణంగా కంటెస్టెంట్స్ చేసే పర్ఫామెన్స్ లు జానీ మాస్టర్ కు నచ్చడం అంటే చాలా అరుదు. ఒకవేళ నచ్చితే మాత్రం ఏకంగా ప్రశంసలతో ముంచెత్తుతాడు జానీ మాస్టర్.
ఇకపోతే ఇటీవలే ఢీ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదలైంది. నందికొండ వాగుల్లోన అనే ఒక పాటకి కంటస్టెంట్స్ డాన్స్ చేసింది. డాన్స్ పర్ఫార్మెన్స్ అటు జానీ మాస్టర్ ని ఫిదా చేసేసింది. ఇక పర్ఫామెన్స్ నచ్చిన తర్వాత ఊరుకుంటాడా ఆ కంటెస్టెంట్ కి జానీ మాస్టర్ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఒక ఖరీదైన జాకెట్ ని బహుమతిగా ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక జానీ మాస్టర్ లాంటి టాప్ కొరియోగ్రాఫర్ ఒక జాకెట్ గిఫ్ట్ గా ఇవ్వడంతో అక్కడున్న వారందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో జానీ మాస్టర్ తో పాటు ప్రియమణి నందితా శ్వేత కూడా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.