అందాల ముద్దుగుమ్మ
సమంత గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ముద్దుగుమ్మ
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి
సినిమా తోనే అదిరిపోయే విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఆ తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు వరుస పెట్టి
బ్లాక్ బస్టర్ విజయలు సాధించడంతో అతి తక్కువ కాలం లోనే అందాల ముద్దుగుమ్మ
సమంత టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్
హీరోయిన్ ల సరసన చేరిపోయింది, ప్రస్తుతం కూడా
సమంత వరస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉంది.
ఇది ఇలా ఉంటే
సమంత ది ఫ్యామిలీ మాన్ సీజన్ టు వెబ్ సిరీస్ ద్వారా
ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే, ఈ వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో నటించిన
సమంత ఈ పాత్ర ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఇలా ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన
సమంత 'పుష్ప' సినిమా లోని స్పెషల్ సాంగ్ తో కూడా
ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది, పుష్ప సినిమా విడుదలై ఇప్పటికి చాలా రోజులే అవుతున్నా ఈ సినిమాలో
సమంత స్పెషల్ సాంగ్ 'ఊ అంటవా మావా' సాంగ్ ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. ఇంతలా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ సాంగ్ గురించి తాజాగా
సమంత స్పందించింది, సమంత ఇటీవల
ముంబయి లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భం గా
మీడియా తో ముచ్చటించింది
సమంత, అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పలేను. పుష్ప
మూవీ లోని 'ఊ అంటావా' పాట పాన్
ఇండియా లెవల్ లో ఈ రేంజ్ విజయాన్ని అందుకుంటుందని ఊహించలేదు అని
సమంత తెలియజేసింది, తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులంతా నేను ఇప్పటి వరకు చేసిన
మూవీ లను మర్చిపోయారు, 'ఊ అంటావా' సాంగ్ తోనే నన్ను గుర్తు పెట్టుకుంటున్నారు అంటూ
సమంత చెప్పుకొచ్చింది.