మెగాస్టార్
చిరంజీవి సినీమా కెరీర్ లోని
బ్లాక్ బస్టర్ హిట్లలో స్టేట్ రౌడీ
సినిమా ఒకటనే విషయం తెలిసిందే. రాధ మరియు భానుప్రియ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ
సినిమా తెరకెక్కగా బప్పి
లహరి ఈ సినిమాకు సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద ఈ
సినిమా ఎన్నో అరుదైన రికార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ
సినిమా రిలీజైన సమయంలో మొదట ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ టాక్ వచ్చిందట..
ఈ సినిమాకు మొదట కోదండ రామిరెడ్డి దర్శకుడిగా ఎంపికైనా కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కు డైరెక్షన్ చేసే ఛాన్స్ బి.గోపాల్ కు దక్కిందట.. సుబ్బరామిరెడ్డి చిరంజీవితో నిర్మించిన ఏకైక
సినిమా స్టేట్ రౌడీ కావడం విశేషం.. 1989 సంవత్సరం
మార్చి నెల 23వ తేదీన ఈ
సినిమా థియేటర్లలో విడుదలైందట. నైజాం బయ్యర్లు బ్లాంక్ చెక్కులు ఇచ్చి ఈ
సినిమా హక్కులు కొనుగోలు చేయాలని అప్పట్లో ప్రయత్నాలు కూడా చేశారు.
సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా కానీ తొలిరోజు నుంచే ఈ
సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసిందని తెలుస్తుంది.. ఈ
సినిమా నైజాంలో కోటి రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ
సినిమా విడుదలయ్యే సమయానికి
అమితాబ్ బచ్చన్ ఆలిండియా
సూపర్ స్టార్ గా ఉన్నారు. అయితే ఆయన సినిమాలను మించి
చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం విశేషం . ఆ సమయంలో ట్రేడ్ గైడ్ అనే ఫిల్మ్ మ్యాగజైన్
చిరంజీవి నటించిన
సినిమా కలెక్షన్ల వివరాలను ప్రచురించి వేరీజ్ అమితాబ్? అని ప్రశ్నిస్తూ ఆర్టికల్ రాసిందట.
వైరల్ అయిన ఆ ఆర్టికల్ ను చదివి
హిందీ సినీ ప్రముఖులు సైతం ఎంతో ఆశ్చర్యపోయారని సమాచారం. కమల్,
రజినీకాంత్ ఈ
సినిమా 100 డేస్ ఫంక్షన్ కు హాజరు కాగా ఈ ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా జరిగింది.