వామ్మో: ఆ హీరో సినిమా బాటలో నడుస్తున్న సూర్య మూవీ..!!
కానీ కొన్ని చోట్ల కొంతమంది నాయకులు ఈ సినిమా ప్రదర్శనపై అడ్డుకోవడం జరుగుతోంది. అందుకు కారణం గతంలో సూర్య నటించిన జై భీమ్ చిత్రం. అందులో ఒక పార్టీకి సంబంధించి నాయకులను చాలా అవమానించేలా చూపించారని ఆ నాయకులు ఆ సినిమా నిలిపివేయాలని తెలియజేశారు. ఇప్పుడు ఆ ప్రభావం ET సినిమాపై చూపిస్తున్నారు. దీంతో ఆ ప్రభావం కలెక్షన్ల పైన పడుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ వీటి ప్రభావం అంతగా చూపలేదని చెప్పవచ్చు. అయినప్పటికీ ఈ సినిమాకి థియేటర్ ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో నెమ్మదిగా ఈసినిమా పుంజుకుంటుందని పంపిణీదారులు తెలియజేస్తున్నారు. ఇక గతంలో హీరో అజిత్ నటించిన వలిమై చిత్రం కూడా ఇలాగే నెమ్మదిగానే పుంజుకుందని తెలియజేశారు.
సూర్య సినిమాకి పోటీగా ఎన్నో సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి.. ఇక ఈ నెలలో ఎక్కువగా బడా సినిమాలు కూడా విడుదల అవుతూ ఉన్న కారణంగా థియేటర్లు మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఒకవేళ విడుదలైన సినిమాలు అంతంత మాత్రమే ఉంటే సూర్య సినిమా వాటిని మించి నెగ్గ గలిగితే థియేటర్లు పెంచే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఏది ఏమైనా తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.