యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా రాధే శ్యామ్, ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా రాధా కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను యు.వి.క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ మార్చి 10 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్ధంగా ఉంది, ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటం తో ఈ చిత్ర బృందం పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి , ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేశాడు, ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ప్రభాస్ , రాజమౌళి ల మధ్య చాలా ఆసక్తి కరమైన మాటలు చోటుచేసుకున్నాయి.
ఇది ఇలా ఉంటే ఇంటర్వ్యూ లో భాగంగా రాజమౌళి కుటుంబానికి సంబంధించిన ఓ వాట్సాప్ గ్రూప్ గురించి రాజమౌళి బయటపెట్టారు, మా కుటుంబం మొత్తానికి ఫస్ట్ డే..ఫస్ట్ షో అనే వాట్సాప్ గ్రూప్ ఉంది అని, అందులో 40–44 మంది సభ్యులు ఉన్నారు. ఆ గ్రూప్ లో చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి, శుక్రవారం జరిగే చర్చ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. శుక్రవారం ఏదైనా సినిమా రిలీజ్ ఉందంటే నా భార్య రమ అందరికీ టికెట్ లను బుక్ చేస్తూ ఉంటుంది, సాధారణంగా 25 నుంచి 30 మంది వరకు టికెట్ లను అడుగుతూ ఉంటారు. అంతా ఇంట్రెస్టింగ్ లేని సినిమా అయితే 10 నుంచి 15 మంది మాత్రమే టికెట్ లను అడుగుతూ ఉంటారు, అదే రాధే శ్యామ్ సినిమాకు మాత్రం 44 మంది టికెట్ లు కావాలి అని మెసేజ్ పెట్టినట్లు ఈ ఇంటర్వ్యూ లో భాగంగా రాజమౌళి తెలియజేశాడు.