చిరంజీవి కి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చింది ఆయనేనటా...!!

murali krishna
గత 20 ఏళ్ల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగొందుతున్నాడు మన చిరంజీవి. ఖైదీ సినిమా నుంచి మొన్న వచ్చిన ఉయ్యాల వాడ నరసింహరెడ్డి సినిమా వరకు చిరంజీవి ఎన్నో బెస్ట్ సినిమాలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించారు.

అందులో కొన్ని తెలుగు సినిమా రికార్డులను కూడా బద్దలు కొట్టాయి. చిరంజీవి అనగానే మనకు గుర్తొచ్చేది మెగాస్టార్ అనే బిరుదు.కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అసలు.. చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో? ఆయనకు మెగాస్టార్ అనే బిరుదు వచ్చే నాటికి చిరంజీవితో పాటు తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కూడా ఉన్నారు. కానీ.. చిరంజీవికే మెగాస్టార్ అనే బిరుదు ఎందుకు వచ్చింది? అసలు దాని కథ ఏమిటి?

ఆయనకు ఆ బిరుదును ఎవరు ఇచ్చారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.మెగాస్టార్ చిరంజీవి అనగానే స్వయంకృషితో ఎదిగిన నటుడు అంటుంటారు. ఇండస్ట్రీలో ఎందరో హీరోలు ఉన్నా.. వాళ్లకు బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ చిరంజీవి మాత్రం ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగాడు. అయితే.. చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదును ఒక నిర్మాత ఇచ్చారట.ఆయన ఎవరో కాదు.. కేఎస్ రామారావు అని తెలుస్తుంది..చిరంజీవితో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో రామారావు చాలానే సినిమాలు చేశాడు. అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కూడా. అప్పట్లో ఎన్టీఆర్ మరియు కృష్ణ, ఏఎన్నార్ లాంటి అగ్ర హీరోలు రాజ్యమేలుతున్నా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు చిరంజీవి.



అదే సమయంలో చిరంజీవితో రామారావు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తీశాడట..వాళ్ల కాంబోలో వచ్చిన తొలి సినిమా అభిలాష. ఆ తర్వాత ఛాలెంజ్ మూవీ కూడా వచ్చింది. రాక్షసుడు, మరణ మృదంగం లాంటి సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయని తెలుస్తుంది.. మరణ మృదంగం అనే సినిమాతోనే చిరంజీవికి తన పేరు ముందు మెగాస్టార్ అనే బిరుదు వచ్చిందట..అప్పటి వరకు చిరంజీవి సుప్రీం హీరో అనే బిరుదుతో ఉండేవాడని ఆ తర్వాత మెగాస్టార్ గా.. రామారావు తన బిరుదును మార్చారని అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి పేరు ముందు ఆ మెగాస్టార్ అలాగే ఉండిపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: