షాకింగ్.. అప్పుడే ఓటీటికి సిద్ధమవుతున్న భీమ్లా నాయక్..?
భీమ్లా నాయక్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఒప్పందం చేసుకున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే మంచి వసూళ్లను భీమ్లా నాయక్ సినిమా రాబట్టింది. అలాగే రాధేశ్యామ్ సినిమా కూడా ఎల్లుండి విడుదల కాబోతుంది. కాబట్టి పెద్దగా భీమ్లా కు ముందు ముందు రెస్పాన్స్ అనేది ఉండకపోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. అందుకే నిర్మాతలు కూడా సినిమాని స్ట్రీమింగ్ చేసేందుకు ఓకే చెప్పారనే ప్రచారం అనేది జరుగుతోంది. కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా సినిమా మూడవ వారం లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఎవరు కూడా ప్రకటించ లేదు. ఇక నిర్మాతలు కూడా విషయాన్ని కొట్టి పారేశారు. నాలుగు వారాల థియేట్రికల్ స్క్రీనింగ్ పూర్తి అయిన తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కాస్త ఆలస్యంగానే అంటే ఈ నెల చివర్లోనే భీమ్లా నాయక్ మూవీని మనం ఓటీటీ ద్వారా చూడబోతున్నాం.