నీ కంటే విష్ణుప్రియ బెటర్.. సుదీర్ పరువు తీసిన రోజా?
ఇలా ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం లో సుడిగాలి సుధీర్ టీం ప్రస్తుతం టాప్ లో కొనసాగుతోంది. ఇకపోతే ఇటీవల ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో విడుదల అయ్యింది. ఇందులో సుడిగాలి సుదీర్ మాంత్రికుడి వేషం ధరించి స్టేజి మీదికి ఎంట్రీ ఇస్తాడు.. అయితే మొన్నటికి మొన్న ఒకప్పటి సుదీర్ కో యాంకర్ విష్ణు ప్రియ కూడా అచ్చం ఇలాంటి మాంత్రికుడి వేషం వేస్తుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇది చూసిన రోజా నీ కంటే విష్ణుప్రియ ఈ గెటప్ లో ఎంతో బాగుంది అంటూ అందరి ముందు చెప్పేస్తోంది. దీంతో అందరూ తెగ నవ్వుకుంటారు. ఇక అన్ని పంచ్ లను ఎంతో ఆనందంగా స్వీకరించే సుదీర్ కూడా నవ్వుకుంటాడు.
ఇక ఆ తర్వాత స్కిట్ లో భాగంగా తోటి కంటెస్టెంట్స్ తో తెగ సందడి చేశాడు సుడిగాలి సుదీర్. ఇక దీనికి సంబంధించిన ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కేవలం సుధీర్ టీం మాత్రమే కాదు రాకింగ్ రాకేష్ టీమ్ కూడా కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను నవ్వించడానికి వచ్చింది అన్నది అర్ధమవుతుంది. ఇక బుల్లెట్ భాస్కర్ టీం చేయబోయే స్కిట్ అయితే హిలేరియస్గా ఉండబోతుంది అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు అభిమానులు.