చిరంజీవి మాటలకు ఎమోషనల్ అయిన సురేఖ...!!
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా అందిస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆయన రక్తదానం చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి తనవంతు ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తుంటారు. తాజా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం జరిగాయి. ఇందులో చిరంజీవితోపాటు ఆయన భార్య సురేఖ, చిరు చెళ్లెళ్లు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళా గొప్పతనం చెప్పిన చిరంజీవి తన జీవితంలోని మహిళల పాత్రని వెల్లడించారట.. ముఖ్యంగా తన భార్య సురేఖ తన సక్సెస్‌లో ఎలా భాగమైందో తెలిపారట చిరు. అల్లు వారి ఇంట్లో తను గారాల పట్టి అని, కానీ తనని పెళ్లి చేసుకున్నాక తమ ఇంట్లో ఆమె పెద్దకోడలు ఇంట్లో అన్ని బాధ్యతలు కూడా తనే చూసుకోవాల్సి వచ్చేదని తెలిపారు. తాను పూర్తిగా సినిమాల్లో బిజీగా ఉండేవాడినని, ఇంటికి సంబంధించిన అన్ని పనులు కూడా సురేఖనే చూసుకునేదని పేర్కొన్నారు చిరంజీవి.
ఈ క్రమంలో ఆమె తన తమ్ముళ్లు, చెళ్ళెళ్ల బాగోగులు కూడా చక్కపెట్టేదని, వారి ఖర్చులు సైతం తనే డీల్ చేసేదని ఆయన తెలిపారు. నాపై ఎలాంటి ప్రభావం పడకుండా అన్ని పనులు తనే చేస్తూ తీరిక లేకుండా గడిపేదని పేర్కొన్నారట చిరంజీవి. తమ్ముళ్లు, చెళ్లెళ్లు, ఫ్యామిలీ చూసుకోవాల్సిన బాధ్యత తనదైన కానీ తను చూసుకోవాల్సిన అవసరం లేకుండా సురేఖ చేసిందని, కష్టమంతా తనే పడిందని పేర్కొన్నారట.. ఇలా అన్నింటికి తనే కారణమని భార్యని సభాముఖంగా చిరంజీవి అభినందించారు. దీంతో సురేఖ కూడా ఎమోషనల్ అయ్యారు.ఇప్పుడు మహిళలు ఇంటికే పరిమితం కాదు అని ఎంతగానో ఎదుగుతున్నారని చెప్పారు. చంద్రమండలానికి కూడా వెళ్లేస్థాయికి ఎదిగారని అలాగే ఒలంపిక్స్ లో మెడల్స్ కూడా సాధిస్తున్నారని గుర్తు చేశారు.