నలుగురు భామలతో.. సుడిగాలి సుధీర్ అదిరే డాన్స్?
ఈ కామెడీ షో లో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ సుడిగాలి సుదీర్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న వారు దాదాపు ఎవరూ లేరు అని చెప్పాలి. ఇక అలాంటి సుడిగాలి సుదీర్ కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ లో యాంకర్ గా అవతారమెత్తి ప్రతివారం కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక అప్పుడప్పుడు అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ లతో కూడా ఆకట్టుకుంటున్నాడు.. ఇకపోతే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో లో భాగంగా సుడిగాలి సుదీర్ ఒక అమ్మాయి తో నిశ్చితార్థం చేసుకున్నట్లు చూపించారు.
ఇక ఇప్పుడు ఇదే బుల్లితెరపై టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ కి సంబంధించి మరొక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో లో భాగంగా నలుగురు భామలతో అదిరిపోయే డాన్స్ చేస్తాడు సుడిగాలి సుదీర్. భీమ్లా నాయక్ సినిమాలో నుంచి అంత ఇష్టం ఏందయ్యా నీకు అనే పాట పై నలుగురు అమ్మాయిలతో డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు. ఇక ఆ తర్వాత ప్రోమో చివరలో మళ్లీ సుధీర్ నిశ్చితార్ధం చేసుకున్నాడు అన్న వీడియో ని కూడా చూపించారు. ఇక ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.