ప్రస్తుతం సోషల్ మీడియా అకౌంట్ లను సామాన్య జనం నుండి మొదలు పెడితే సెలబ్రిటీ ల వరకు ఏ రేంజ్ లో ఉపయోగిస్తున్నారో మన అందరికీ తెలిసిందే, సినిమా సెలబ్రిటీల విషయానికి వస్తే వారు చేసే ప్రతి పనిని, అలాగే వారు చేసే సినిమాల గురించి ఇతర విషయాల గురించి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తమ అభిమాను లతో పంచుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియా వాడకం లో మెగా డాటర్ నిహారిక కూడా ఆ రేంజ్ యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే, ఎప్పటికప్పుడు అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకునే మెగా డాటర్ నిహారిక తాజాగా త ఇన్ స్టా అకౌంట్ ను డిలీట్ చేసింది, సోషల్ మీడియా లో ఎంతో యాక్టివ్ గా కనిపించే మెగా డాటర్ నిహారిక సడెన్ గా తన ఇన్ స్టా అకౌంట్ ను డిలీట్ చేయడం ఏంటని నెటిజన్లు ఆరా తీశారు.
అయితే రీసెంట్ గా జిమ్ లో నిహారిక షేర్ చేసిన ఓ వీడియో పై ట్రోల్స్ రావడంతో అకౌంట్ డిలీట్ చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది, మరి మెగా డాటర్ నిహారిక తన ఇన్ స్టా అకౌంట్ ని డిలీట్ చేయడానికి అదే కారణమా మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ఒక మనసు సినిమా తో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక 2020, డిసెంబర్ 9 న చైతన్య జొన్నలగడ్డ ని వివాహం చేసుకొని అటు కుటుంబ జీవితాన్ని ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తుంది, కొంత కాలం క్రితమే నిహారిక ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ ను నిర్మించింది, ఈ వెబ్ సిరీస్ తో నిహారిక ప్రొడ్యూసర్ గా మారింది, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలను సంపాదించుకుంది.