క్యాష్ షోలో పెద్ద ప్రమాదం.. స్టేజ్ మీద నుండి కింద పడ్డ జబర్దస్త్ నరేష్?

praveen
ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతుంది సుమ. సుమ ఏదైనా కార్యక్రమం చేసింది అంటే చాలు అది తప్పకుండా హిట్ అవుతుంది. అంతలా తన యాంకరింగ్ తో అదరగొడుతుంది సుమ. ఇక ఎప్పుడు స్పాంటేనియస్ పంచులతో ప్రతి షో లో బుల్లితెర ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటుంది. ఇక ఈ టీవీ లో ప్రస్తుతం క్యాష్ అనే కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది అన్న విషయం తెలిసిందే.


 ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ కార్యక్రమం ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతివారం నలుగురు సినీ సెలబ్రిటీల ను క్యాష్ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించడం.. ఇక ఆ తర్వాత వారిని ఆసక్తికర ప్రశ్నలు అడగడం స్పాంటేనియస్ పంచులతో నవ్వులు పూయించటం చేస్తూ ఉంటుంది సుమా. అంతేకాకుండా వారితో ఫన్నీ టాస్క్ లు ఆడిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమంలో ఇటీవలే పెద్ద ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. క్యాష్ కార్యక్రమంలో కి గెస్ట్ గా వచ్చిన జబర్దస్త్ నరేష్  ప్రమాదానికి గురయ్యాడు.


 ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో  ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా నాలుగు జంటలు ఎంట్రీ ఇస్తాయ్.  ఇకపోతే టాస్క్ లో భాగంగా మేల్ గెస్ట్ లు వారి తో పాటు వచ్చిన అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తారు. కానీ అటు జబర్దస్త్ నరేష్ మాత్రం యాంకర్ సుమ కి ప్రపోజ్ చేశాడు. సుమ మాత్రం ఒప్పుకోలేదు. కానీ ప్రోమో చివర్లో మీరు ఒప్పుకోకపోతే కిందకు దూకేస్తానంటూ నరేష్ స్టేజి చివరికి వెళ్తాడు. చివరికి కాలు జారి కింద పడిపోతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత అంబులెన్స్ సౌండ్ వినిపిస్తారు. ఏం జరిగిందన్నది మాత్రం ఫుల్ ఎపిసోడ్ లో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: