ఓరినాయనో.. అందరి ముందే అతనికి ముద్దు పెట్టేసిన జబర్దస్త్ ఫైమా?

praveen
ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన కార్యక్రమం ఏదీ అంటే టక్కున చెప్పేస్తారు జబర్దస్త్ అని. ఎందుకంటే ఒక సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టించింది. జబర్దస్త్ తర్వాత ఎన్నో కార్యక్రమాలు వచ్చినప్పటికీ అవి జబర్దస్త్ ను మాత్రం బీట్ చేయలేకపోయాయి అని చెప్పాలి. ఇకపోతే జబర్దస్త్ ప్రేక్షకులకు నవ్వులు పెంచడమే కాదు అటు ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో అయితే లేడీ కమెడియన్స్ కూడా జబర్దస్త్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.


 ఒకప్పుడు జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ కనిపించేవారు కాదు. మగవాళ్లే లేడీ గెటప్ లు వేసే వారు. కానీ ఇటీవల కాలంలో వర్ష, ఫైమా  రీతు లాంటి ఎంతో మంది కమెడియన్స్ జబర్దస్త్ లో కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో జబర్దస్త్ ఫైమా అయితే తనదైన శైలిలో కామెడీ టైమింగ్ తో ఎంతగానో పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ప్రతి స్కిట్ లు కూడా అద్భుతమైన కామెడి తో అదరగొడుతోంది. ఇటీవల క్యాష్ కార్యక్రమంలో భాగంగా ఫైమా తన తోటి జబర్దస్త్ కంటెస్టెంట్స్ తో కలిసి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది.



 ఈ క్రమంలోనే ఇక జబర్దస్త్ లో కూడా తనదైన శైలిలో పంచులతో అదరగొట్టింది ఫైమా. అంతా బాగానే ఉంది కానీ.. ఇక క్యాష్ కార్యక్రమంలో భాగంగా అందరి ముందు జబర్దస్త్ కమెడియన్ కి కిస్  ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. క్యాష్ కార్యక్రమానికి ఫైమాతోపాటు జబర్దస్త్ నరేష్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. నరేష్ కి కాస్త బూస్ట్ ఇస్తా అంటూ చెప్పిన ఫైమా బలవంతంగా జబర్దస్త్ నరేష్ కు ముద్దు పెట్టింది. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు. ఇక దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: