అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, శృతి హాసన్, కమల్ హాసన్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది, అయితే మొదట ఈ ముద్దుగుమ్మ నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం అయినప్పటికీ ఆ తర్వాత నటించిన సినిమాలతో మంచి విజయాలను అందుకని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శృతి హాసన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది, శృతి హాసన్ మాట్లాడుతూ... అందరికీ ఉండే భయాలతోనే నేను కూడా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాను, హీరోయిన్ క్యారెక్టర్ లకు సరిపోనని, నా వాయిస్ బాగోలేదని, నేను సక్సెస్ ఫుల్ మూవీ స్టార్‌గా ఎదగలేనని కొందరు నా గురించి మాట్లాడుకున్నారు.
దానితో పాటు తెలుగు లో నేను చేసిన తొలి రెండు సినిమాలు అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ అంతగా ఆడలేదు, దానితో నేను ‘అన్ లక్కీ’ అని, ‘ఐరన్ లెగ్’ అంటూ మాట్లాడుకున్నారు. కానీ తెలుగు లో నేను నటించిన మూడో సినిమా గబ్బర్ సింగ్ మంచి విజయం సాధించడం తో నన్ను గోల్డెన్ లెగ్ అని పిలవడం ప్రారంభించారు, ఓవర్ నైట్ లోనే అంతా మారిపోయింది అని శృతి హాసన్ తెలియజేసింది. ఇది ఇలా ఉంటే శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా సలార్ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తో పాటు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా గోపిచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది, ఇలా ప్రస్తుతం వరుస సినిమాలతో శృతి హాసన్ ఫుల్ బిజీ గా ఉంది.