భీమ్లా నాయక్ తో బాలయ్య అడుగులు !

Seetha Sailaja
‘భీమ్లా నాయక్’ మూవీ ఘన విజయం సాధించడంలో ఆ మూవీ కథ అత్యంత కీలకంగా వ్యవహరించింది. రొటీన్ సినిమా కథలకు భిన్నంగా ఉన్న ఈమూవీ కథ మాస్ ప్రేక్షకులకు కూడ బాగా నచ్చడంతో ఇలాంటి వెరైటీ కథల వైపు యంగ్ డైరెక్టర్స్ అదేవిధంగా యంగ్ రైటర్స్ ఆలోచనలు కొనసాగుతున్నాయి.


ప్రస్తుతం ‘అఖండ’ సూపర్ సక్సస్ తో మంచి జోష్ లో ఉన్న బాలకృష్ణ తాను భవిష్యత్ లో నటించబోయే సినిమాల కథల విషయంలో చాల విభిన్నంగా ఆలోచిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య బాలయ్యను ఒక యంగ్ డైరెక్టర్ కలిసి ఒక విభిన్నమైన కథను చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.


ఈకథ ఒక కన్నడ మూవీ కథకు మార్పులు చేసిన కథ అని అంటున్నారు. ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ రానా పాత్రలు ఏవిధంగా అనుక్షణం ఇగోలతో రగిలిపోతు ఉంటాయో బాలయ్యకు చెప్పిన కథలో కూడ ఒక అన్న-చెల్లెలు నిరంతరం ఇగో లతో రగిలిపోతు ఒకరి పై ఒకరు కక్ష లతో రగిలిపోతారని తెలుస్తోంది.


ఆకథలో కక్షలు తార స్థాయికి చేరుకోవడంతో ఒక స్థాయిలో ఆ చెల్లి ఏకంగా తన అన్నను హత్యా చేయించాలని మాష్టర్ ప్లాన్ వేస్తుందట అను క్షణం ఇగో ల మధ్య సతమతం అయిపోయే ఆ కథ అంతా రాయలసీమ ఫ్యాక్షనిజం నేపధ్యంలో ఉంటుందట. ఈ కథకు టైటిల్ విషయంలో రెడ్డి అన్నపదం వచ్చే విధంగా ఆ యంగ్ డైరెక్టర్ బాలయ్యకు చెప్పగానే ఎలర్ట్ అయిన బాలయ్య టైటిల్ లో ‘రెడ్డి’ అన్న పదం వద్దు అని చెప్పి ఆ కథకు కొన్ని మార్పులు చేసాడట. గతంలో ‘సమరసింహా రెడ్డి’ లాంటి బ్లాక్ బష్టర్ సినిమాలో నటించిన బాలయ్యకు తన లేటెస్ట్ మూవీ విషయంలో రెడ్డి అన్న పదం వద్దు అని చెప్పిమట్లు వస్తున్న గాసిప్ లకు సబంధించిన లీకులు తెలుసుకుని చాలమంది షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: