బాలీవుడ్ పై మనసు పారేసుకున్న టాలీవుడ్ భామలు..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి పొజిషన్ లో ఉండి తెలుగు నాట స్టార్ హీరోయిన్ లుగా కొనసాగుతున్న కొంత మంది ముద్దుగుమ్మలు కూడా బాలీవుడ్ సినిమా లలో నటించాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఉంటారు,  అలా ఇప్పటికే  కొంత మంది ముద్దుగుమ్మలు బాలీవుడ్ సినిమాలపై మనసు పారేసుకున్నారు,  అలాంటి ముద్దుగుమ్మల గురించి మనం తెలుసుకుందాం.

ఇలియానా : గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా  కొనసాగుతున్న సమయం లోనే బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది,  ఇందులో భాగంగా ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి సినిమా అవకాశాలు కూడా దక్కాయి,  కాకపోతే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్  దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ కు ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు చాలా వరకు తగ్గాయి.

సమంత : సమంత టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయం లోనే 'ది ఫ్యామిలీ మాన్'   వెబ్ సిరీస్ లో నటించింది,  ఈ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ కావడంతో సమంత కు ఇండియా రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది,  ఇది ఇలా ఉంటే సమంత పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు కూడా ఓకే చేసినట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి.

రాశి ఖన్నా : అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య సరసన థాంక్యూ,  గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది, ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రాశి ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫుల్ ఫోకస్ పెట్టింది,  అందులో భాగంగా రాశి ఖన్నా 'రుద్ర'  హిందీ అనే  వెబ్ సిరీస్ లో కూడా నటించింది, ఈ వెబ్ సిరీస్ పాటు రాశి ఖన్నా పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: