ఎన్నో ఫెయిల్యూర్స్ చూసా.. అవకాశాలు కూడా రాలేదు : పూజా హెగ్డే

praveen
సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్నది ఎవరు అంటే అందరూ టక్కున చెప్పేస్తారు పూజా హెగ్డే. ఒక లైలా కోసం అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా పూజా హెగ్డే  తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది.తెలుగు తమిళం కన్నడం అనే తేడా లేకుండా అన్ని భాషల్లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. అంతేకాదండోయ్ బాలీవుడ్లో కూడా మంచి అవకాశాలే ఈ అమ్మడు పట్టేస్తుంది.



 ఇకపోతే పూజా హెగ్డే హీరోయిన్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం రాధేశ్యామ్ ఇక ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎంతో బిజీగా ఉండి పోయింది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోలీవుడ్ లో తెరకెక్కిన మూగముడి సినిమాతో నటిగా కెరీర్ మొదలైంది. ఈ స్థాయిలో ఉన్నానంటే కోలీవుడ్ పరిశ్రమ వళ్లే. అందుకే నాకు కూడా కొలీవుడు అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానం. పదేళ్ల తర్వాత ఇప్పుడు బీస్ట్ లో నటించే అవకాశం వచ్చింది. రాధేశ్యామ్ సినిమాలో నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పలేదు భవిష్యత్తులో మాత్రం తప్పకుండా తమిళంలో డబ్బింగ్ చెబుతా అని చెప్పుకొచ్చింది.



 అదే సమయంలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నువ్వు ఎప్పుడూ బిజీగా ఉండే హీరోయిన్ అని అందరూ అంటుంటారు.. నిజం చెప్పాలంటే నేను కూడా ఎన్నో ఏమో పరాజయాలు చవి చూశాను.. గతంలో నాకు అవకాశాలు కూడా ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.. కానీ ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేస్తున్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నా.. అయితే ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ ఎప్పుడూ ఉంటుంది.  నెంబర్ 1 గా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదని.. నటనతో చరిత్ర సృష్టించాలని చూస్తున్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: