మొదట ఘోస్ట్ సినిమాలో
కాజల్ అగర్వాల్ ను చిత్ర బృందం
హీరోయిన్ గా ఎంపిక చేసుకుంది, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ
సినిమా నుండి
కాజల్ అగర్వాల్ తప్పుకుంది. అయితే ఆ తర్వాత
అమలా పాల్ ను ఘోస్ట్ చిత్ర బృందం
హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి, ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో
హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పటి వరకు చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఇలా బంగార్రాజు
సినిమా కంటే ముందు మొదలైన ఘోస్ట్
సినిమా చాలా స్లో గా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది, ఇది ఇలా ఉంటే
నాగార్జున ప్రస్తుతం
బిగ్ బాస్ 'ఓ టి టి' కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.