వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్ మీద ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  వరలక్ష్మి శరత్ కుమార్ కోలీవుడ్ సినిమాల  ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది,  అయితే కోలీవుడ్ సినిమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఆ తర్వాత టాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ వచ్చింది.  అందులో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి'  సినిమాలో నటించింది,  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది,  అయితే ఆ తర్వాత కూడా వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మంచి ఆఫర్లు వచ్చాయి.  


అందులో భాగంగా పోయిన సంవత్సరం ఈ ముద్దుగుమ్మ నటించిన క్రాక్ సినిమా మంచి విజయం సాధించడం,  అలాగే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ చేసిన పాత్రకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.  అందులో భాగంగా ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్ తేజ  సజ్జా హీరో గా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా హను మాన్  లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది,  అలాగే సమంత ప్రధాన పాత్ర లో తెరకెక్కుతున్న యశోద సినిమా లో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతోంది.  ఈ రెండు సినిమా లతో పాటు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమా లో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ నటించబోతోంది,  ఇలా వరలక్ష్మి శరత్ కుమార్ వరుస సినిమా లతో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: