సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైన జక్కన్న.. మహేష్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
అయితే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఇక రాజమౌళి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో అన్నది తెలుస్తుంది. ఎన్నో రోజుల నుంచి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలో ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ పూర్తి కావడంతో మహేష్ బాబు తో చేయబోయే ప్రాజెక్టు పైన ఫోకస్ పెట్టాడట జక్కన్న. అయితే పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట రాజమౌళి. ఇటీవలే జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కలుసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
అయితే వీలైనంత తొందరగా షూటింగ్ ఇదే ఏడాది చివర్లో మొదలుపెట్టాలని అనుకుంటున్నాడట రాజమౌళి. ఇలా జరిగితే మహేష్బాబు ఒకవైపు త్రివిక్రమ్ మరో వైపు రాజమౌళి సినిమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. తన హీరోలను వీలైనంతగా మిగతా సినిమాలకు దూరంగా ఉంచే రాజమౌళి ఇక మహేష్బాబు విషయంలో కూడా ఇలాంటి రూల్స్ పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఇక సినిమా 2024 దసరా సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి అనుకుంటున్నాడట. ఇక ఈ ఏడాది చివర్లో మహేష్ బాబు ఫస్ట్ లుక్ విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.