పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కొషియన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కింది, ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందించాడు, ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించగా, దగ్గుబాటి రానా సరసన కేరళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది, ఇది ఇలా ఉంటే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన థియేటర్ లాల్ విడుదల అయ్యింది, విడుదల అయిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న భీమ్లా నాయక్ సినిమా మొదటి మూడు రోజులు ముగిసే సరికి వంద కోట్లకు పైగా కలెక్షన్ లను సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షం కురిపించింది.
ఈ సినిమా ప్రస్తుతం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను రాబడుతోంది, ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భీమ్లా నాయక్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి, అయితే భీమ్లా నాయక్ సీక్వెల్ పై వస్తున్న వార్తలకు తాజాగా రానా చెక్ పెట్టేసాడు. ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ సీక్వెల్ గురించి తాజాగా దగ్గుబాటి రానా కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది, దానికి రానా కూడా అంతే ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. భీమ్లా నాయక్ మూవీ సీక్వెల్ గురించి ఇందులో డానియేల్ శేఖర్ పాత్ర లో నటించిన దగ్గుబాటి రానా ను అడగగా దానికి ఆయన... ఈ కథ ఎక్కడ ఎండ్ అవ్వాలో అక్కడే అయిందని... ఇంకా దీనికి సీక్వెల్ ఉంటుందని నేను అనుకోవడం లేదు... అంటూ దగ్గుబాటి రానా చెప్పుకొచ్చారు, ఇలా భీమ్లా నాయక్ సీక్వెల్ పై వస్తున్న వార్తలకు దగ్గుబాటి రానా చెక్ పెట్టేసాడు.