ఈటి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సూర్య షాకింగ్ కామెంట్స్?
ఇక మరికొన్ని రోజుల్లో ఈటి అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం గా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే అటు తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ఊహించని రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నాడు సూర్య. తన సినిమాలు కూడా టాలీవుడ్ లో విడుదల చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈటి సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ సాంగ్స్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. మార్చి 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు సూర్య.
హీరోలు కంఫర్ట్ జోన్ లో ఉంటే ఎదుగుదల ఉండదు అంటూ వ్యాఖ్యానించాడు. కంఫర్ట్ జోన్ లో ఉండాలి అనుకుంటే ఎదుగుదల ఉండదు.. ఆ జోన్ నుంచి బయటికి వచ్చినప్పుడు మార్పు ఉంటుంది.. మన మనసు ఏది చెబితే అది వినాలి అందుకోసమే కష్టపడాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సూర్య. అయితే ఇక ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసాడు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది..