పాపం : ఈ హీరోయిన్ ని ఒంటరిగా రమ్మన్నది ఎవరో తెలుసా..?

frame పాపం : ఈ హీరోయిన్ ని ఒంటరిగా రమ్మన్నది ఎవరో తెలుసా..?

Divya
సినిమా ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని అప్పుడప్పుడు కొంతమంది నోరువిప్పి చెబుతున్నారు.. ఇప్పుడు తాజాగా ఒక సదరు హీరోయిన్ కూడా ఈ విషయంపై నోరు విప్పడం జరిగింది. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ హీరోయిన్ పేరు తక్కువ గా తెలిసి ఉంటుంది. ఆ హీరోయిన్ పేరే ఇషా కొప్పికర్ . ఈమె కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాలుగు చిత్రాలలో నటించింది. అయినప్పటికీ కూడా కొంత మంది ప్రేక్షకులు ఈమెను బాగా గుర్తుంచుకున్నారు.

ఇక హీరో నాగార్జున సరసన చంద్రలేఖ సినిమాలో ఇషా కొప్పికర్ నటించింది. ఇందులో రమ్యకృష్ణ చెల్లెలుగా నటించడంతో మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది.. ఇక ఆ తర్వాత ప్రేమతో రా.. కేశవ వంటి సినిమాలలో నటించింది. అయితే తాజాగా ఈమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇషా కొప్పికర్ క్యాస్టింగ్ కౌచ్ పై ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను తెలియజేసింది. ఒకానొక సమయంలో ఒక హీరో తనని ఒంటరిగా కలవడానికి ప్రయత్నించాడని ఆమె తెలియజేసింది. అంతేకాకుండా అలా కలవ నందుకు తనని సినిమా నుండి తొలగించారని ఆమె తెలియజేసింది. ఇషా కొప్పికర్ 1990 సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 2000లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. బాలీవుడ్లో లో ఒక హీరో స్థానం పక్కన నటించే అవకాశం వచ్చింది.. కానీ ఆ హీరో రమ్మన్న చోటికి పోకపోవడంతో..ఆ అవకాశం ఒక నటుడు కూతురు వద్దకు వెళ్లిందని తెలిపింది.


ఇటీవల ఇషా కొప్పికర్.. రీ ఎంట్రీ ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నప్పటికీ.. తక్కువగా అవకాశాలు వస్తున్నాయి. 2000 వ సంవత్సరంలో కూడా ఈమె ఎన్నో సినిమాలలో నటించింది. ఇక 2009వ సంవత్సరంలో టిమ్మీ నారంగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నది. ఇక వీరిద్దరికీ రియానా అనే కూతురు కూడా పుట్టింది. దీంతో ఆమె కాస్త విశ్రాంతి తీసుకుని సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపింది.2000 వ ఈ సంవత్సరంలో ఒక ప్రముఖ నిర్మాత తనకు ఫోన్ చేసి, హీరోతో మంచిగా నడుచుకోవాలని, వారు కోరినట్లుగా వ్యవహరించాలని తెలియజేశాడట. కానీ ఆమెకు అవన్నీ నచ్చకపోవడంతో ఆ సినిమాని రిజెక్ట్ చేశానని తెలియజేసింది. అంతే కాకుండా నిర్మాత ఆ హీరోతో అన్నీ మాట్లాడాలి అని చెప్పడంతో నాకు కోపం వచ్చిందని తెలియజేసింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: